CTA గురించి
గూడపాటి జగన్మోహనరావు, వలసరవాక్కం లోని కామాక్షి నగరంలో వున్న సన్ షైన్ ప్లే స్కూల్ ఆవరణలో మిత్రులు యన్.బి. ఆర్.ప్రసాద్,కొల్లి రాము, పి. రమేష్ బాబు, పి. ఉమాపతి, పి. కుమార్ రాజా, పోలయ్య నాయుడు, కోటేశ్వరరావు మరికొందరు ప్రతిరోజు ఉదయం షటిల్ ఆడుతుండేవారు. అప్పుడప్పుడు నేను కూడాను. విరామ సమయాల్లో పేపరు వార్తలు, రాజకీయాలే గాక పలు అంశాలు చర్చించుకునే వాళ్ళం. ఆ సమయంలోనే మాకో ఆలోచన వచ్చింది. సుమారు నలభై శాతం తెలుగువారు నివసిస్తున్న ఈ వలసరవాక్కంలో అందరూ కలసి ఓ తెలుగు సంఘంగా ఎందుకు ఏర్పడకూడదని. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి సంఘ నిర్వహణలో పూర్వానుభవమున్న నన్ను కన్వీనరుగా ఎంచుకోవడం జరిగింది.వలసరవాక్కం మరియు చుట్టు ప్రక్కల నున్న పలువురు మిత్రులతో సమావేశాలు జరిపిన పిమ్మట ఓ సంఘం ఏర్పడాలన్న నిర్ధారణకు రావడం తదుపరి 2005 సంవత్సరం మే 22వ తేదీన అదే స్కూలు ఆవరణలో సుమారు యాభై మంది మిత్రులు సమావేశమై మన ఈ సంఘానికి 'చెన్నై తెలుగు అసోసియేషన్' గా నామకరణం చేయడం జరిగింది. అదే రోజున ఓ తాత్కాలిక కార్యవర్గాన్ని కూడ నియమించడం జరిగింది. పలువురు పెద్దలను కూడ సంప్రదించి మన అసోసియేషన్ బై-లాస్ తయారు చేసి 2005 జూన్ 23న రిజిష్టరు చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో సభ్యులను చేర్పించిన తరువాత సంఘం పూర్తి స్థాయిలో కార్యక్రమాలు చేపడితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ప్రారంభోత్సవం చేయడంజరిగింది .
1
స్థాపన సంవత్సరం
1+
మొత్తం సభ్యులు
1+
కమిటీ సభ్యులు
ఒక సంవత్సరంలో
జనవరి
1. సంక్రాంతి సంబరాలు
ఏప్రిల్
1. ఉగాది
2.శ్రీ రామ నవమి
అక్టోబర్
1. వైద్య శిబిరం
నవంబర్
1. వనభోజనాలు
సినిమాలు
ఉత్తమ సినిమా విడుదల సమయం మరియు నెలపై ఆధారపడి ఉంటుంది
పర్యటన
సీజన్ మరియు సభ్యులపై ఆధారపడి ఉంటుంది
OUR VIDEO GALLERY
BOARD MEMBERS
K. GOPALAKRISHNA REDDY
President
V. VIJAYENDRA RAO
Vice-President
B. VENKAIAH NAIDU
General Secretary






